TEJA NEWS

తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా ఎన్నికైన పలు వార్డు అధ్యక్ష, కార్యదర్శులు లను అభినందనలు తెలిపిన మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

చిలకలూరిపేట : నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ సమస్థాగత ఎన్నికలలో భాగంగా పట్టణంలోని 9, 30, 36 వార్డులలో నూతన కార్యవర్గాలను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రత్తిపాటి క్యాంప్ కార్యాలయంలో వారిని మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందనలు తెలియజేశారు. పార్టీ కోసం విశేష కృషి చేసిన వారిని పార్టీ లో సముచిత స్థానం కల్పించే విధంగా పార్టీ ఉంటుంది అని తెలిపారు. కూటమి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను ప్రజల్లో తెలుసుకొని పోయి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొనిరావాలి ప్రత్తిపాటి అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన 9వ వార్డుకు అధ్యక్షులుగా గోపిదేశి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా మామిళ్ళ దాసు, 30 వ వార్డు అధ్యక్షులుగా ఖాజా పాచ, ప్రధాన కార్యదర్శిగా షబ్బీర్ అలీ, 36వ వార్డు అధ్యక్షులు గా ఈదర వెంకటరావు, ప్రధాన కార్యదర్శి గా బండారు కాశియ్య ను ప్రత్తిపాటి అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, పట్టణ, వార్డు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.