
ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతి ఖ్యాతిని చాటిన తెలుగుదేశం పార్టీ.
టీడీపీ సభ్యునిగా ఉండటం గౌరవం.
అన్న ఎన్టీఆర్ ఆశయాల సాధనకు విశేష కృషి.
దార్శనికులు సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే ఏపీ సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమం సాధ్యం.
కోటికి పైగా సభ్యత్వాలతో రికార్డు సృష్టించిన టీడీపీ.
మంత్రి లోకేష్ సారథ్యంలో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం,
ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింప చేసిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ఉండటం ఒక గౌరవం, మర్యాద అని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని రక్షించడం కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాల సాధనకు తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ ఇంఛార్జి వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో సీఏ కన్వెన్షన్ లో జిల్లా మినీమహానాడును గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం , విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) , ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ , టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య , స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ , టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా , మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న , విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ , జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , ఉమ్మడి కృష్ణాజిల్లా మాజీ చైర్ పర్సన్ శ్రీమతి గద్దె అనురాధ , మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు , నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు , టీడీపీ అధికార ప్రతినిధి రఫీ తదితర టీడీపీ నేతలతో మైలవరం శాసనసభ్యులు, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు.
ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అన్న ఎన్టీఆర్ గారి ప్రతిమకు పూలమాలలు వేసి, పుష్పములు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులలో తన తండ్రి మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు కూడా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
దార్శనికులు సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఏపీ సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమం సాధ్యమన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆనాడు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడే సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.
2019లో ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏపిని అంధకారంలోకి నెట్టాడని అన్నారు. ఏపీని ఎలా అభివృద్ధి చేద్దామని సీఎం చంద్రబాబు ఆలోచిస్తే, ఏపీలో ఏ వనరులను ఎలా దోచుకోవాల అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడన్నారు. మద్యం, ఇసుక మాఫియా ద్వారా వేల కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు.
సీఎం చంద్రబాబు గారు తన పరిపాలనా దక్షతతో ఏపీని గాడిలో పెడుతున్నారని అన్నారు. ఏపీ ఉజ్వల భవితకు 2029లో కూడా సీఎంగా చంద్రబాబు ని అందరూ గెలిపించుకోవాలన్నారు. ఇందుకు మనమంతా ఆయనతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి లోకేష్ సారథ్యంలో కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేసిందన్నారు. కోటికి పైగా సభ్యత్వాలతో రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు. నారా లోకేష్ కి ఎప్పుడు పార్టీ పగ్గాలు పూర్తిగా అప్పచెప్పాలో సీఎం చంద్రబాబు కి తెలుసని, ఇప్పుడు ప్రత్యేకంగా తీర్మానం అవసరం లేదన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీపీలు, జడ్పిటిసీలు, ఎంపీటీసీలు, సర్పంచిలు పూర్తిగా టీడీపీ విజయకేతనం ఎగురవేసేందుకు మంతా ఐకమత్యంగా పనిచేద్దామన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపరుద్దామన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాదు ఘనంగా స్వాగతం పలికారు.
