
తెలుగు జవాన్ మురళీనాయక్ మరణవార్త తీవ్రంగా కలచివేసింది : మాజీమంత్రి ప్రత్తిపాటి
- పాకిస్తాన్ కాల్పుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ త్యాగాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి : ప్రత్తిపాటి
“ భారత్ – పాక్ యుద్ధం నేపథ్యంలో జమ్ము కశ్మీర్ లో భారత జవాన్, తెలుగువాడైన మురళీ నాయక్ మరణించడం విచారకరం. సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం, కలియాతండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ మరణవార్త తీవ్రంగా కలిచివేసింది. పేద కుటుంబంలో పుట్టి, పట్టుదలతో ఎంతో కష్టపడి భారత సైన్యంలో చేరిన తెలుగుబిడ్డ, చిన్నవయసులోనే భరతమాత రక్షణకోసం తన ప్రాణాలర్పించి దేశానికే ఆదర్శంగా నిలిచాడు. పుట్టెడు దుఖంలో ఉన్న మురళీ నాయక్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మురళీ నాయక్ దైర్య సాహాసాలు, త్యాగాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. పహల్గామ్ దుర్ఘటనలో అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన పాకిస్తాన్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటే మంచిది. వెర్రి ఆవేశం మూర్ఖత్వంతో సరిహద్దుల్లో అమాయక ప్రజలపై కాల్పులు జరపడాన్ని పాకిస్తాన్ తక్షణమే ఆపేయాలి. ప్రజలు, జవాన్లే లక్ష్యంగా జరిపే కాల్పులకు దాయాదిదేశమే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినంతకాలం పాకిస్తాన్ నష్టపోతూనే ఉంటుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ పాలకులు విచక్షణతో ఆలోచించి తమ విధానాలు మార్చుకోకుంటే, భారీ మూల్యం చెల్లించుకుంటారు.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు.
