
పది రోజుల క్రితమే నిశ్చితార్థం: అంతలోనే విషాదం
హైదరాబాద్:
గుజరాత్‌లోని జామ్ నగర్‌లో గురువారం అర్ధరాత్రి ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘట నలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఒక పైలట్ ప్రాణాలు కోల్పో గా.. మరొక పైలట్ గాయా లతో బయటపడ్డాడు.
అయితే ఈ దుర్ఘటనలో సిద్ధార్థ్ యాదవ్(28) అనే పైలట్ ప్రాణాలు వదిలాడు. 2016లో నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్ష (NDA)లో ఉత్తీర్ణత సాధించి భారత వైమానిక దళంలో చేరాడు. గత నెల మార్చి 23న నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.
ఇందుకోసం సిద్ధార్థ యాద వ్ సిద్ధపడుతు న్నాడు. కానీ ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. శిక్షణలో ఉండగా ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే జామ్‌నగర్ జిల్లాలోని సువార్ద గ్రామంలోకి వచ్చేటప్పటికీ ప్రమాదం పొంచి ఉందని గుర్తించాడు.
ఇళ్ల మధ్య కూలిపోతే.. పెద్ద ఎత్తున నష్టం జరుగుతుం దని భావించాడు. ప్రమాదం నుంచి ప్రజలను కాపాడా లని నిర్ణయం తీసుకున్నా డు.. తనతో పాటు ఉన్న కో-పైలట్‌ను కిందకు దించేసి.. జనసాంద్రత లేని ప్రాంతానికి జెట్‌ను నడిపించాడు.
సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు.. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. దీంతో సిద్ధార్ధ యాదవ్ అమరడుయ్యాడు. కానీ గ్రామస్తుల ప్రాణాలను కాపాడి.. ఒక సాహస వీరుడయ్యాడు.
గురువారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలోని వైమానిక దళం స్టేషన్ నుంచి జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. కొన్ని నిమిషాల్లోనే కూలి పోవడంతో రేవారీ నివాసి అయిన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ మరణించాడు. సిద్ధార్ధ ఇటీవలే సెలవుల తర్వాత విధులకు రావడం బాధాకరం.
