TEJA NEWS

గురజాల నియోజకవర్గంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులను అభినందించిన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్
పిడుగురాళ్ల
అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ఇలానే విద్యను అభ్యసించాలని చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్, పల్నాడు హాస్పిటల్స్ అధినేత డాక్టర్. చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. పట్టణంలోని పల్నాడు హాస్పిటల్ నందు గురజాల నియోజకవర్గం లో పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి, గురజాల మండలాలలో పదో తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు హాస్పిటల్ అధినేత, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ… చిన్నతనం నుంచే లక్ష్యాల వైపు విద్యార్థులు నడవటం అభినందించిన తగ్గ విషయం అన్నారు. గవర్నమెంట్ స్కూలులో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన తెలియజేశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారందరినీ గురజాల నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అభినందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ లాయర్ ధారా చెన్నయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు, చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.