TEJA NEWS

27 న మోడల్ స్కూల్ ప్రవేశాలకు పరీక్ష..!!

మహబూబాబాద్/ మహబూబాబాద్ మండల పరిధిలోని శివారు అనంతారం మోడల్ స్కూల్ లో 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈనెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ గండి ఉపేందర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 27న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈనెల 21న సంబంధిత ప్రభుత్వ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని కోరారు.