TEJA NEWS

గడువు ఇచ్చినందుకు ధన్యవాదాలు

షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపిన రియల్టర్స్

ఎల్ఆర్ఎస్ రాయితీ గడువును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుందనీ దీనివల్ల మరికొంత సమయం లబ్ధిదారులకు దొరుకుతుందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రియాల్టర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. షాద్ నగర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను రియాల్టర్లు కలుసుకొని ఆయనను శాలువాతో సన్మానించారు. లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు గత నెల 31తో ముగిసిందనీ దీంతో ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువును ప్రభుత్వం పొడిగించిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మరో నెల రోజుల పాటు 25 శాతం రిబేట్ వర్తించనుందనీ ప్రభుత్వం దురదృష్టం అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని గడువు పొడిగించడం లబ్ధి చేకూరడం మంచి విషయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ప్రత్యేకంగా కలుసుకొని వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, రాజు గౌడ్, ఉపాధ్యక్షులు ఎండి కబీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి మంచిరేవుల అశోక్, మహమ్మద్ అజమాత్, ఖాలేద్ ఖాన్, దాస రమేష్, శ్రీనివాస్ చారి, శ్రీను, దర్శన్, యాదగిరి, పవన్ తదితరులు పాల్గొన్నారు…