TEJA NEWS

నయనానందకరంగా “కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి” 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు….

స్వామివారి కల్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన “బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్” …

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేస్ -1 నందు గల కళ్యాణ తిరుపతి దేవాలయ 17వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , మాజీ కార్పొరేటర్ కె.ఎం.గౌరీష్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి బ్రహ్మోత్సవ పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా భక్తులచే పూజలు అందుకుంటున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించి 17 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా స్వామివారి కరుణ, కటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు సత్తిరెడ్డి, విజయ్, గురుబ్రహ్మం, రంగ సుబ్బయ్య, మోహన్, నాగిరెడ్డి, బ్రహ్మం, సుధాకర్, కాలనీవాసులు దయాకర్, శ్రీకాంత్ రెడ్డి, సత్యం, రమణ, శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి, రమణా రెడ్డి, సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.