TEJA NEWS

మిల్లులకు ధాన్యాన్ని త్వరగా తరలించాలి : అదనపు కలెక్టర్

సూర్యపేట జిల్లా ప్రతినిధి: కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం 2, టేకుమట్ల 2 మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు రాయినిగూడెం 2 నుండి 4743.20 క్వింటాల ధాన్యం, టేకుమట్ల 2 కొనుగోలు కేంద్రం నుండి 6948.8 క్వింటాలు ధాన్యం తరలించడం జరిగిందని తెలిపారు. రైతులు తాలు లేకుండా శుభ్రమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తీసుకోనిరావాలని తేమ శాతం 17రాగానే సీరియల్ ప్రకారం కాంట వేసి మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు.గాలి దుమ్ము, అకాల వర్షాలు పడుతున్నందున వడ్లు తడవకుండా టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో కేంద్ర ఇన్చార్జిలు గౌతమి,ఫణిమా, సరిత తదితరులు పాల్గొన్నారు.