Spread the love

పాఠశాలల్లో వసతుల కల్పనే ధ్యేయం: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ప్రభుత్వ పాఠశాలలో రూ. 78 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, కార్పొరేటర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ లో భాగంగా ఎమ్మెల్యే SDF (రాష్ట్ర సమగ్ర శిక్షఅభియాన్) నిధులు ద్వారా ZPHS శేరిలింగంపల్లి పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులు (6) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేఖపూడి గాంధీ , MEO వెంకటయ్య , పలువురు ప్రముఖులు, నాయకులతో కలిసి అదనపు తరగతి గదులను ప్రారంభించిన గౌరవ శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . అనంతరం వారు మాట్లాడుతూ..చూడ ముచ్చటైన తరగతి గదులు, క్లాస్ రూమ్ లో డ్యూయల్ డెస్క్ లు, విద్యుత్తు వెలుగులు, పరిశుభ్రమైన టాయిలెట్లు, స్వచ్ఛమైన మంచినీళ్ల ట్యాంకులు, వంటగదులు భోజనశాలలు, వాకింగ్ ట్రాక్లు చుట్టూ ప్రహరీలు ఇలా అనేక సకల సదుపాయాలతో విద్యార్థులు ఏకాగ్రతతో నిశ్చింతగా చదువులు కొనసాగించేందుకు అవసరమైన ఆహ్లాదకర వాతావరణాన్ని పెంచిపెడుతున్నాయని అన్నారు. పిల్లల చదువులకు సరికొత్త భరోసాను అందిస్తున్నాయని అన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ..విద్యాభివృద్ధి కోసం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు ఉపయోగకరమైన అవసరమైన అదనపు తరగతి గదులను త్వరితగతిన నిర్మించి, వారికి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. విద్యార్థులంతా చరవాణిలు, టీవీలకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వసతి సౌకర్యాలు సద్వినియోగించుకొని మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలని చెప్పారు. ప్రతి ఒక్కరు లక్ష్యంతో కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో TSEWIDC ఈఈ రాంకుమార్, డిఈ కలీముద్దీన్, ఏఈ శ్యామ్ ప్రసాద్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బల్వంత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, రాజ్ కుమార్, సుధాకర్ రెడ్డి, పాండు ముదిరాజ్, రవీందర్, సయ్యద్ నయీమ్, ఉపాధ్యాయులు కరుణ, వీరేశం, ఆంజనేయులు, పద్మావతి, విజయ, పద్మకుమారి, సూర్యప్రభ, శ్రీనివాసులు, కిషోర్, సుజాత, పద్మావతి, విద్యార్థులు, స్థానిక కార్యకర్తలు గణేష్ ముదిరాజ్, మల్లేష్, నటరాజ్, మహేందర్ సింగ్, సలీం, మహిళా నాయకురాళ్లు కుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.