
పేదరికం లేని సమాజం సృష్టించడమేతెలుదేశం పార్టీ లక్ష్యం:-తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్.
తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం ఉయ్యురు పట్టణం మండలం లోని వివిధ గ్రామాల్లో ఘనం గా నిర్వహించారు ఉయ్యురు లో నిర్వహించిన వేడుకల్లో తెదేపా ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు,
అనంతరం రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉయ్యురు మండలం ఆకునూరు గ్రామంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు అనంతరం పార్టీ సీనియర్ నాయకులైన గారపాటి గణపతి రావు కాకని చందరావు లను సన్మానించారు.
ఈ సందర్భం గా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ..తెలుగు వారి ఆత్మగౌరవం,సామాజిక న్యాయం,ప్రజాసంక్షేమం అనే ఆశయాలతో తెలుగుదేశం పుట్టిందని అన్నారు ,పేదవాడికి కూడు,గూడు,గుడ్డ అనే నినాదం తో తెలుగు వారి ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అధికారానికి వచ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోఅనేక విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు ,తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సంక్షేమం అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర విభజనతో రోడ్డున పడ్డ రాష్ట్రాన్ని అభివుద్ది చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తెచేందుకు కృషి చేస్తున్నారు అన్నారు,దేశం లో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం ఒక్క టీడీపీ కె సొంతం అన్నారు,మరో శతాబ్దం పాటు తెలుగుదేశం పార్టీ దేశానికి రాష్ట్రానికి ఆదర్శం గా నిలుస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగేదేశం పార్టీ రాష్ట్ర ,జిల్లా,మండల,గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
