
పార్టీలకతీతంగా పేద ప్రజల ఆరోగ్యలను కాపాడడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం,ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామానికి చెందిన కాలే వెంకటమ్మ భర్త పేరు రాములు అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం వెళ్లడం జరిగింది, అక్కడి డాక్టర్లు చాలా డబ్బులు అవుతాయి అని చెప్పడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు తడిసిన ప్రదీప్ రెడ్డి సహకారంతో స్థానిక శాసనసభ్యులు కశి రెడ్డి నారాయణరెడ్డి ని కలవడం జరిగింది. వెంబడి స్పందించిన శాసనసభ్యులు ఎల్.ఓ.సి కోసం రిఫర్ చేయడంతో నిన్న మంజూరైన ఎల్.ఓ.సి.45000-00 రూపాయల చెక్కును తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి స్థానిక నాయకులు తడ సిన ప్రదీప్ రెడ్డి కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు టి శ్రీరాంరెడ్డి, డి మల్లయ్య, జాజాల నరేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
