TEJA NEWS

ఘనంగా పోలాశమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం

ఉత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

అవనిగడ్డ మండలం పులిగడ్డలో శ్రీ పోలాశమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఉత్సవాలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు, యువనాయకులు మండలి వెంకట్రామ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.

ముందుగా ఆలయ అర్చకులు దీవి పార్థసారధాచార్యులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ నిర్వాహకులు మండలి వెంకటేశ్వరరావు, కో-కన్వీనర్ మండలి శేషు ఘనంగా సత్కరించారు. జాతర మహోత్సవంలో భాగంగా అభిషేకాలు, కుంకుమ పూజలు, పోతురాజు సంబరం నిర్వహించారు. గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.