TEJA NEWS

గుత్తి వారి నిశ్చితార్థ వేడుకల్లో బైరెడ్డి,దారపనేని

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణ అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్, బాలాజీ జ్యువెలర్స్ అధినేత గుత్తి వెంకటరాజ, శ్రీమతి బుజ్జమ్మ దంపతుల కుమార్తె దివ్య, నెల్లూరు జిల్లా వింజమూరు వాస్తవ్యులు జలగం వెంకటరత్నం, శ్రీమతి దొరసాని దంపతుల కుమారుడు చిరంజీవి వెంకట నరేంద్ర ల నిశ్చితార్థం వేడుకలు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ నిశ్చితార్థ వేడుకల్లో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, దేవస్థానం నిర్మాణ ధర్మకర్త పెండ్యాల సూర్యనారాయణ దంపతులు, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, బోయిళ్ళ నారాయణరెడ్డి పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. గుత్తి అనిల్ ,లక్ష్మీ యశస్విని దంపతులు, తిరుమల శెట్టి అశోక్, కల్పన దంపతులు,కనిగిరి నియోజకవర్గ బిజెపి కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య, ఉప్పలపాటి హరిబాబు, పాలపర్తి వెంకటేశ్వర్లు, ఊస మధుసూదన్ రావు, నరసింగు సాంబశివరావు, బండ్ల నారాయణ, దరిశి రాము, సుబ్రహ్మణ్యం, ఓగూరి నరసింహారావు, గుత్తి వారి కుటుంబ సభ్యులు, జలగం వారి కుటుంబ సభ్యులు, పామూరు పట్టణంలోని ప్రముఖ జ్యువెలరీ షాప్ యజమానులు, తదితరులు భారీ సంఖ్యలో నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.