
కేంద్రం కీలక నిర్ణయం.. ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యం పంపిణీ!
రేషన్ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని, ఈ నెలాఖరు నాటికి లబ్దిదారులకు పంపిణీ
పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం
చర్చనీయాంశమైంది.
