Spread the love

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.

సాక్షిత : విద్యా, వైద్యం ఉపాధి అవకాశాల తోడ్పాటును కల్పిస్తాం

సాగునీరు, తాగునీరుఅందించేందుకు వరికిపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేస్తాం: నరసరావుపేట ఎంపీ లావుశ్రీ రామకృష్ణ దేవరాయలు.

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే అరవింద బాబు.

కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో సత్రం, గిరిజన భవనం ఏర్పాటు చేయాలి:గిరిజన సంఘాల నాయకులు.

చిలకలూరిపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. నరసరావుపేట లోని ప్రకాష్ నగర్ లో షాది ఖానా లో శనివారం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 286వజయంతి గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు.వి.కోటా నాయక్ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి పాల్గొని ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునేందుకు గిరిజన వసతి గృహాలను మెరుగుపరచడమే కాకుండా పల్నాడు జిల్లాలో చింతల తండా, బట్రుపాలెం తోపాటు అత్యధిక జనాభా గల మరో నాలుగు గ్రామీణ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతుందన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు అందించేందుకు కృషిస్తుందన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరికిపూడి శెల ప్రాజెక్టు పూర్తి అయితే ఆ కష్టాలు తొలగిపోతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోయువత చదువు మీద దృష్టిసారించాలన్నారు. సేవలాల్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము అంటే 286 సంవత్సరాల క్రితమే నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటే జీవన అభివృద్ధి కొనసాగించుకోవచ్చన్నారు. వైద్యం అందనిరోజుల్లో నాటు వైద్యం అందించే ప్రజలకు కాపాడిన ఘనత దక్కుతుందన్నారు.

అటువంటి వారి ఆదర్శాలను, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సేవలాల్ జయంతిని జాతీయ పండుగగాగుర్తించలనే విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగిందన్నారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో అన్నదాన,ఇతర కార్యక్రమాలకు సత్రం ఏర్పాటు చేయాలని, నరసరావుపేటలో గిరిజన భవనం ఏర్పాటుకు స్థలాలు ఇవ్వాలని అరవింద బాబు కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా భోగ్ బండార్ నిర్వహించి, సేవలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్, డాక్టర్ లక్ష్మా నాయక్, సోషల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోస్న, సర్పంచ్ వి. శ్రీను నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా యూత్ అధ్యక్షులువి. రవి నాయక్, రాష్ట్ర మహిళా నాయకురాలు నూతక్కి కృష్ణ రేఖ, గిరిజన జానపద కళా పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఈ.శ్రీను నాయక్ ,టిడిపి ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎం. శ్రీను నాయక్, నాయకులు ఎం. వెంకటేష్ నాయక్, యన్ హనుమా నాయక్, పలు గ్రామీణ ప్రాంతాల గిరిజన తండాల పెద్దలు, వివిధ గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.