
కేంద్ర ప్రభుత్వంలేబర్ కోడ్ లు రద్దు చేయాలని .
.తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి పి సురేష్ డిమాండ్.
వనపర్తి
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను సవరణల పేరుతో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ ల రూపంలో తెచ్చిన చట్టం రద్దు చేస్తారా లేక గద్దె దిగుతరో తేల్చుకోవాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంసిఎచ్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మికులు 139 వ మేడే సన్నాహాక
సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పి. సురేష్ మాట్లాడుతూ:-నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగవంతంగా పటిష్టమైన కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ యాజమాన్యాలకు కార్పొరేట్ బహుళ జాతి గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తూ కార్మికుల సంక్షేమానికి సమాధి కడుతున్నారని ధ్వజమెత్తారు. మోడీ ఫాసిస్టు విధానాలను నిరూపిస్తూ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు యావత్ కార్మిక వర్గం సిద్ధమవుతున్నదని అన్నారు. మే 1న నిర్వహించుకోబోయే ప్రపంచ కార్మిక దినోత్సవం 8 గంటల పని దినానికి ప్రతీక అని కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 8 గంటల దినాలను రద్దు చేస్తూ 12 గంటల పని విధానం మళ్లీ అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాజీలేని పోరాటాలకు సిద్ధం అవుతామని మేడే ను పురస్కరించుకొని ప్రతిన బూనుతామని అన్నారు. కార్మికుల అడ్డాలలో గ్రామ గ్రామాలలో కార్మికుల మేడే జెండాలను అరుణ పతాకాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యూనియన్ బ్రాంచ్ నేతలు గంధం శ్రీనివాస్, నరసింహ రాజేష్ నరేందర్ కుమార్ భరత్,అశోక్,బాను, మోహన్,మధు,కిషోర్, శ్రీహరి,ఇందిరా, లక్ష్మి,కవిత రాణి,భాగ్యమ్మ,శివమ్మ,మహేశ్వరి,అనిత, లక్ష్మీ,సుజాత,ప్రేమలత,పద్మ,ప్రేమిళ,భాగ్య తదితరులు పాల్గొన్నారు.
