
ప్రపంచ పర్యావరణ సంస్థను అభినందించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి
పుదుచ్చేరి ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకులు రంగస్వామి పుదుచ్చేరిలో స్వగృహంలో ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పర్యావరణ జీవజాతి సంరక్షణ కోసం మన ప్రపంచ పర్యావరణ సమస్య చేస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ రోజులలో ఇటువంటి సమస్యను చూడడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆయన ఆశ్చర్యను వ్యక్తపరిచారు ఈ భూమి మీద జీవజాతిని వృక్షజాతిని మానవజాతిని జంతు జాతిని జీవవైవిద్యాన్ని కాపాడటమే లక్ష్యంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులను చైతన్య పరుస్తూ ప్రపంచ పర్యావరణ సంస్థ పర్యావరణ పరిరక్షణ ఏకమవుదాం రండి అన్న ఏకైక నినాదంతో పని చేయడం నిజంగా ఎంతో గొప్ప విషయం అన్నారు ఇటువంటి సమస్యతో కలిసి మా ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు భవిష్యత్తులో పుదిచ్చేరి కేంద్ర పాలిత రాష్ట్రాన్ని పర్యావరణ పరిరక్షణ అనుకూలమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ రికగ్నేషన్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ చైర్మన్ తమ్మినేని సత్యనారాయణ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి ప్రతి పాఠశాల విద్యార్థి ప్రపంచ పర్యావరణ సంస్థ చెబుతున్న సూత్రాలను తప్పకుండా పాటించడానికి మీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని అందుకోసం ప్రతి విద్యార్థి కనీసం తన పాఠశాల విద్య కాలంలో కనీసం 10 మొక్కలు నాటాలని వాటిని పరిరక్షించాలని అన్ని వేదికల మీద పర్యావరణానికి అనుకూలమైన విద్యార్థులను తయారు చేయాలని అందుకు పుదుచ్చేరి ప్రభుత్వం సంపూర్ణ సహయ సహకారాలు అందించాలని పుదుచ్చేరి భారతదేశంలోనే ప్రపంచంలోనే ఎంతో సుందరమైన ప్రదేశం ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు ప్రతి పర్యాటకుడు పర్యాటకురాలు కనీసం ఒక మొక్కను నాటి అందమైన మన పుదిచ్చేరిని నిర్మించాలని అందుకోసం ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రపంచ పర్యావరణ సంస్థ కలిసినడవాలని కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్ రంగస్వామి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం మన ప్రపంచ పర్యావరణ సంస్థ దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో ఏ సమస్త చేయలేనని కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షలాది మొక్కలు నాటుతూ వేలాది కార్యక్రమాలు టాక్స్ ఫైలింగ్ ఇండియా సంస్థ చైర్మన్ చల్లూరి శ్రీనివాస్ సహకారంతో నిర్వహిస్తూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా దాదాపుగా రెండు నుంచి ఐదు లక్షల క్లాస్ బ్యాగులను పంచిపెట్టి ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరు తమ విద్యార్థి దశలో తమ పుట్టినరోజు తమ వివాహ దినోత్సవ వేడుకలలో తమ పూర్వికులు చనిపోయిన వర్ధంతి దినోత్సవాల్లో మొక్కలని బహుమతులుగా సమర్పించాలని అందుకోసం ప్రపంచ పర్యావరణ సంస్థ చేస్తున్న అన్ని కార్యక్రమాలు నిస్వార్ధంగా ప్రతి ఒక్కరు ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ పాండిచ్చేరి రాష్ట్ర కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొని ప్రపంచ పర్యావరణ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు దేశం కోసం భవిష్యత్తు తరాల కోసం భూగోళం సంరక్షణ కోసం జరుగుతున్నాయని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రధాన కార్యదర్శి నిఖిల్ కోశాధికారి రిజ్వాన్ మరియు సహాయ కార్యదర్శి రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొని సందర్భంగా ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు
