TEJA NEWS

పేదలకు ఆసరా, సీఎం సహాయ నిధి

  • క్షతగాత్రునికి సీఎం సహాయ నిధి అందజేత
  • ఎమ్యెల్యే గొండు. శంకర్
    (శ్రీకాకుళం – )

పేదలకు ఆసరా, సీఎం సహాయ నిధని, ప్రజారోగ్యమే మాకు ముఖ్యమని శ్రీకాకుళం ఎమ్యెల్యే గొండు. శంకర్ అన్నారు. స్థానిక మహాలక్ష్మి నగర్ కోలనీకి చెందిన వనరాస.సురేష్ రహదారి ప్రమాదంతో అనారోగ్య కారణంగా మంచానికే గత కొంత కాలంగా పరిమితమయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతూ లివర్ సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆర్ధిక స్థోమత అడ్డం కాగా, సీఎం సహాయనిధికి దరకాస్తు చేయ్యగా, స్పందించిన శ్రీకాకుళం ఎమ్యెల్యే గొండు. శంకర్ సీఎం సహాయనిధినుండి 66,900 రూపాయల చెక్ ను బాధితునికి ఎమ్యెల్యే కార్యలయంలో అందించి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్య సంపదతోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యమని, శారీరకంగా, దృడంగా ఉంటేనే జీవించగలమన్నారు.
కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలయితే కుటుంబమంతా అస్తవ్యస్తం అవుతుందని, కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురికావడం నిజంగా బాధాకరమైన విషయమన్నారు. మీకు కష్టం ఎదురైనప్పుడు, మీ కుటుంబాన్ని ‘పెద్దకొడుకు’ గా ఆదుకుంటానని మాటఇచ్చానని, ఇప్పుడు నిలుపుకుంటున్నానన్నారు. వైద్య ఖర్చుల కోసం నా వంతుగా మీకు సీఎం సహాయ ‘నిధి’ నుంచి రూ.66,900/- మంజూరు చేశామన్నారు. మెరుగైన చికిత్సకు అవసరమైనవిధంగా ఖర్చు చేస్తూ ఆరోగ్యంగా ఉంటూ మీ కుటుంబానికి అండగా నిలవాలన్నారు.

ఈ కార్యక్రమంలో వనరాస.సురేష్ కుటుంబ సభ్యులు, స్థానికులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.