
రాష్ట్ర ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం, బాధితులకు ఎల్.వో.సి అందించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి
సాక్షిత చిలకలూరిపేట గత ప్రభుత్వం రోగుల్ని పట్టించుకోకుండా, CMRF ని నిలిపేసి పేద ప్రజల మరణానికి కారణం అయ్యింది, కానీ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఆలా జరగకూడదు అని CMRF నిధుల్ని ప్రజలకు అందిస్తూ, వైద్యం చేయించుకోలేని వారికి ముందుగా LOC ఇచ్చి వారి వైద్యానికి సహాయం చేసి కూటమి ప్రభుత్వం వారిని ఆదుకుంటున్నది అని మాజీ మంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు, అనంతరం బాధితులకు 2,00,000 రూపాయల LOCను అందచేశారు…
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు , జవ్వాజి మదన్ , కామినేని సాయిబాబా , మద్దిబోయిన శివ పాల్గొన్నారు
