
హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ అధ్యక్షులుగా”నాలుగవ సారి టివి.ఆంజనేయులు” గెలుపు….
125 – గాజుల రామారం డివిజన్ “హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ” వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. గత పదేళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్నీ డివిజన్లలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరిచామని, రానున్న రోజుల్లో కూడా అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరుస్తున్నారు. కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకమని, సంక్షేమ సంఘం సభ్యులంతా ఒక తాటిపై ఉన్నప్పుడే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో గాజుల రామారం డివిజన్ అధ్యక్షులు విజయ్
రామ్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ కమలాకర్, సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు టివి.ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి. శ్యాం కుమార్, సంయుక్త కార్యదర్శి హెచ్. మల్లికార్జున్, కోశాధికారి ఏ. అప్పలరాజు మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
