
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న ఆత్మ భావనతో ఉద్భవించినదే తెలుగుదేశం పార్టీ……………… నాగర్ కర్నూల్ పార్లమెంట్ అడ్ హాక్ కమిటీ కన్వీనర్ బి.రాములు
తెలంగాణలో కేసీఆర్ తమకు ఏ రకంగా సరిపోరు
*
రావుల చంద్రశేఖర్ రెడ్డి కారణంగానే నియోజకవర్గంలో పార్టీ రోడ్డు మీదకి వచ్చిందని ఆరోపణ
ఘనంగాతెదేపా 43వ ఆవిర్భావ దినోత్సవం
వనపర్తి
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న ఆత్మ భావంతో ఉద్భవించి పేదవాడికి కూడు గూడు గుడ్డ అన్న నినాదంతో ఆవిర్భవించినది తెలుగుదేశం పార్టీ అని నాగర్ కర్నూల్ పార్లమెంట్ హడక్ కమిటీ కన్వీనర్ బి రాములు అన్నారు శనివారంతెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని హనుమాన్ టేకిడ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం బి రాములు మాట్లాడుతూ 1980 దశకంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ అనుచితి ఏర్పడడంతో తన సినీ గ్లామర్ తో నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించడం జరిగిందని పార్టీని ప్రారంభించిన తొమ్మిది నెలలోనే 202 సీట్లను గెలుచుకొని ప్రభంజనాన్ని సృష్టించి అధికారంలోకి రావడం జరిగిందని ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగిందని అందులో భాగంగా రెండు రూపాయల కిలో బియ్యం మహిళలకు ఆస్తి హక్కు పాలమూరులో జూరాల ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేసింది పటేల్ పట్వారి పాలనను రద్దు చేసి బలహీన వర్గాల ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యాన్ని కల్పించిందన్నారు
ఆ తర్వాత కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ పేరుతో నినాదం తీసుకురావడంతో ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిందని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సొంతంగా ఐదు సంవత్సరాలు పాలించిందని ప్రతిపక్ష పార్టీలతో కలిసి నేడుకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కానీ తెలంగాణలో టిడిపి ఆంధ్ర పార్టీ అని కెసిఆర్ విషప్రచారం చేయడంతో 20 ఏళ్లుగా నాయకత్వ లోపంతో వెనకబడిపోయిందని అయినా గ్రామాలలో టిడిపికి అభిమానులు కార్యకర్తలు నాయకులు అలాగే ఉన్నారని మే నెలలో కడప మహానాడు సభ తర్వాత తెలంగాణలోపార్టీ వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను వేసి పార్టీ
బలోపేతాన్ని కి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తారని తెలిపారు టిఆర్ఎస్ పార్టీ కి మూలం టిడిపి అన్న విషయాన్ని కెసిఆర్ మర్రిచారని కెసిఆర్ తమకు ఏ రకంగా పోటీ కారని తేల్చి చెప్పారు నియోజకవర్గంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి నీ పార్టీ నమ్మితే రాత్రికి రాత్రి పార్టీని
పిరాయించడం వలననే టిడిపి పార్టీ ఉనికి కోల్పోయి రోడ్డు మీదకి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. కడప మహానాడు తర్వాత తెలంగాణలో వచ్చే ప్రతి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీను కాగితాల లచ్చన్న అడ్వకేట్ షాకీర్ హుస్సేన్ కొత్త గొల్ల శంకర్ ఏర్పుల చిన్నయ్య హోటల్ బలరాం డి బాలరాజు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
