
కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో చేసింది ఏమి లేదు, చేసేది ఏమీ లేదు, చేసే దానిపై అసలు స్పష్టతే లేదు : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ కేటాయింపులలో ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని విస్మరించిన తీరుపై నగరంలోని తెలంగాణ భవన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదు… చేసేది ఏమీ లేదు, కనీసం చేసేదానిపై స్పష్టత కూడా లేదు.
తెలంగాణ బడ్జెట్ 2025 లో ఉపముఖ్యమంత్రి భట్టి ప్రసంగం పూర్తిగా అవాస్తవాలతో కూడింది. 150 పేరాగ్రాఫ్లతో 72 పేజీలతో బడ్జెట్ ను మొక్కుబడిగా గత సంవత్సరం బడ్జెట్ ను మక్కీకి మక్కి దించుతూ బడ్జెట్ ప్రవేశపెట్టడం తప్పదు అనే రీతిలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు గాని ప్రజా సంక్షమం, రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనబడడం లేదు.
ప్రభుత్వము ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా పాలనపై ఇంకా పట్టులేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో, అభివృద్ధి ఫలాలు అందజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సుమారు 11 బడ్జెట్లు ప్రవేశపెట్టిన పూర్తిగా అవాస్తవంగా ఇంత ఘోరమైన బడ్జెట్ ఏ బడ్జెట్ లేదు.
గత బడ్జెట్ లో కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా మళ్లీ ఆ బడ్జెట్ అంకెలనే ప్రవేశపెట్టి అంకెల గారడిలో చిత్తశుద్ధి కనిపించింది కానీ, ప్రజలకు చేయాల్సిన దానిలో ఎటువంటి స్పష్టత లేదు.
తెలంగాణ రాష్ట్రానికి ఆదాయ వనరులలో సింహ భాగంగా సుమారు 60 శాతం రాబడి హైదరాబాదు నుంచి వస్తుంది. గత పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసి హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాము కనుకే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థాయిలో అభివృద్ధి చెందింది. సుమారు అరవై శాతం రాబడి తెచ్చిపెట్టే హైదరాబాదు నగరాన్ని బడ్జెట్లో పూర్తిగా విస్మరించింది ఈ ప్రభుత్వం.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత, పెద్దలు కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆస్పత్రుల నిర్మాణ పనుల్లో ఎటువంటి పురోగతి లేదు.
మెట్రో రైల్ – 2,3 ఫేస్ లో గతంలో కేటాయించిన నిధులనే విడుదల చేయలేదు. దీంతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెట్రో నిర్మాణంలో ప్రభుత్వానికి నిర్దిష్ట కాల పరిమితి లేదు. ప్రజా అవసరాలకు రాయదుర్గం – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రోను కొనసాగించాలని చెప్పినా, ఆందోళన చేసినా… ఉన్న నగరాన్ని విస్మరించి ఊహలనగర అభివృద్ధిపై రాష్ట్రం నుంచి ఎటువంటి నిధులు కేటాయించకుండా కేవలం కేంద్ర నిధులపై ఆధారపడడం చూస్తుంటే మెట్రో పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనబడట్లేదు.
నార్త్ హైదరాబాద్ మెట్రో అభివృద్ధి పనుల్లో ఎటువంటి ముందడుగు లేదు. ఫోర్త్ సిటీలో స్పోర్ట్స్ సిటీ, స్కిల్ ఇండియా పేరుతో ప్రభుత్వం చేస్తున్న హైరానాకు గ్రేటర్ హైదరాబాద్ వాసులు గందరగోళానికి గురవుతున్నారు.
ఫోర్త్ సిటీ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్, భూదందా చేస్తున్నారు.
బడ్జెట్లో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కెసిఆర్ ప్రభుత్వం నిరుత్సాహపరిచిందని అవాస్తవాలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, కేవలం గ్రేటర్ హైదరాబాద్ లోనే బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఇళ్ళను నిర్మించి ఇప్పటికే 70 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించిన విషయం తెలుసుకొని మాట్లాడాలి.
గత బడ్జెట్లో నియోజకవర్గానికి 3000 ఇండ్లు ఇస్తామని చెప్పి 22,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అరచి పెట్టిన దాఖలాలు లేవు.
ఇక గ్రేటర్ హైదరాబాదులో మౌలిక వసతులు, శాంతిభద్రతల నిర్వహణ లో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడుతుంది.
గ్రేటర్ హైదరాబాదులో దాదాపు 40 శాతం వీధిలైట్లు వెలగడం లేదు. వీధిలైట్ల నిర్వహణ కూడా ప్రభుత్వానికి చేతనవడంలేదు.
మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలకై నగరంలో 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాటి నిర్వహణ లేక రోజురోజుకు నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. పోలీస్ శాఖ నుంచి ఎన్ని వినతులు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోక సీసీ కెమెరాల నిర్వహణ కూడా లేకుండా పోయింది. తద్వారా నగరంలో రోజురోజుకి క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది.
జిహెచ్ఎంసి పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదనే కోపంతోనే హైదరాబాద్ ప్రజలపై పగబట్టి తన అక్కసును వెళ్లబుచ్చుతుంది.
హైదరాబాద్ నగరంలో 31 ఫ్లైఓవర్ ల పనులు, 17 అండర్ పాస్ ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు. కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదు.
తెలంగాణకు గుండెకాయ అయినా హైదరాబాద్ నుంచి ఒక్క శాసనసభ్యుడు, ఒక ఎమ్మెల్సీ కూడా మంత్రి పదవికి అర్హుడు కాడా. ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే హైదరాబాద్ నగరం సేవారంగంలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకోవడం విడ్డూరం. గత మా బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 – 23 సంవత్సరానికి గాను 2,41,275 కోట్ల ఐటీ ఎగమతలను సాధించిందంటే అది కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, నాటి మంత్రి కేటీఆర్ గారి ప్రణాళికలతోనే సాధ్యమైంది.
బడ్జెట్ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పూడికతీత పనులు చేపట్టినట్టు చెప్పిన అబద్ధాలు చూస్తుంటే గత పాలకులు ఏనాడు మౌలిక వసతుల నిర్వహణలో భాగంగా పూడికతీత పనులు చేయలేదా…? చేయకుండానే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందా…?

అబద్దాలను చెప్పుకుంటూ చివరకు మోరీలను కూడా సాఫ్ చేశామని చెప్పుకొనే దిగజారే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుంది. వీరి మాటల్లో భావదారిద్రం తప్పా హైదరాబాద్ నగరాభివృద్ధిపై ఇటువంటి ప్రణాళికలు కనిపించడం లేదు.
ప్రభుత్వం చేసింది లేక, చేసేది లేక, చేయబోయే దానిపై స్పష్టత లేదు.
ధనార్జన ధ్యేయంగా కార్యాచరణ కనపడుతుంది తప్పా ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వ ఆసక్తి కనబడట్లేదు.
హెచ్ ఆర్ డి సి ఎల్, ఎస్ ఎన్ డి పి, ఎస్ ఆర్ డి పి పనులపై బడ్జెట్లో అసలు దాని ప్రస్తావనే లేదు. పోనీ ప్రభుత్వానికి హెచ్ ఆర్ డి సి ఎల్, ఎస్ ఎన్ డి పి, ఎస్ ఆర్ డి పి పనులపై నగరానికి చెందిన శాసనసభ్యులుగా మేము చెబుదామంటే వినే పరిస్థితిలో లేరు.
రెండు మూడు రోజుల్లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాదు నగరంపై ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అప్పటికి ప్రభుత్వం చలించకుంటే ఆందోళన, ధర్నాలు నిర్వహిస్తాం