
సన్న బియ్యం అందరికీ చేరాలన్న కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష||
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చౌక దారుల దుకాణంలో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రమంతా శ్రీకారం చుడుతున్న సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గం లోని 125 డివిజన్ డివిజన్ అధ్యక్షులు ఎండి లాయక్ ఆధ్వర్యంలో గాజులరామారంలోని శ్రీ రామ్ నగర్ -బి, సుభాష్ చంద్ర బోస్ నగర్ -బి, పి . పి నగర్, లెనిన్ నగర్,శ్రీనివాస్ నగర్, కైసర్ నగర్ చౌక దారుల దుకాణలలో పేద ప్రజల కోసం సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, గఫ్ఫార్, సమీర్ ఖాన్, అజయ్, శ్రీనివాస్ గుప్తా, అసిఫ్, రెహానా బేగమ్, ఖలీమ్, రహీమ్, బోయిని వెంకటేష్, ఐ మధ్, పటోళ్ల లక్ష్మి రెడ్డి పాల్గొన్నారు.
