TEJA NEWS

దేశ వారసత్వ సంప్రదాయ వైద్య విధానం ఆయుర్వేదం : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • ఆయుర్వేద వైద్యశిబిరం ప్రారంభించి, రోగులతో మాట్లాడిన ప్రత్తిపాటి

చిలకలూరిపేట అనేక రకాల దీర్ఘకాల వ్యాధులకు ఆయుర్వేదవైద్యం గొప్ప పరిష్కారమని, అనాదికాలం నుంచి భారతదేశ వారసత్వ సంపదగా, సంప్రదాయ వైద్యంగా ఆయుర్వేదం కొనసాగుతోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన రాధాకృష్ణ ఆయుర్వేద వైద్యశిబిరాన్ని ప్రత్తిపాటి ప్రారంభించారు. ఆయుర్వేదంతో ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని, వైద్యులు, దాతలు నిర్వహించే ఉచిత వైద్యశిబిరాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పుల్లారావు కోరారు. అన్నిరకాల వ్యాధులకు అయుర్వేదవైద్యంలో పరిష్కారాలున్నాయని, ప్రజలు నిస్సందేహంగా ఆయుర్వేద చికిత్స పొందవచ్చన్నారు. శిబిరానికి వచ్చిన ప్రజలతో మాట్లాడిన ప్రత్తిపాటి, వారికి మెరుగైన వైద్యం అందించి ఆయుర్వేదంపై ప్రజల్లో నమ్మకం కలిగేలా వైద్యులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాల వ్యాధి తో ఇబ్బంది పడే వారికి పరీక్షించిన వైద్యులు, వారి జబ్బులకు అవసరమైన మందుల్ని ఉచితంగా అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, బేరింగ్ మౌలాలి, అర్వపల్లి సురేష్, డాక్టర్లు మురళీకృష్ణ, విష్ణు ప్రియా తదితరులు పాల్గొన్నారు.