TEJA NEWS

అంబేద్కర్ కల్పించిన హక్కులకై సిపిఐ పోరాడుతోంది
మతాల పేరుతో ప్రజల మధ్య మంటలు పెడుతున్న బిజెపి
వనపర్తి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగంలో రాసిన హక్కుల కోసం సిపిఐ పోరాడుతుందని పట్టణ కార్యదర్శి రమేశ్ అన్నారు. వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్ లో సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి NFIW ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాలకృష్ణ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రకురుమయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించినా, ఆచరణలో అమలు కావటం లేదన్నారు. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ఇంకా అభివృద్ధిలోకి రాలేదన్నారు.

రాజ్యాధికారం కొందరే చలాయిస్తున్నారని, దేశంలో సంపద కొందరి చేతుల్లోనే కేంద్రకృతమై ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం సంపన్నులకే దేశ సంపద దోచిపెడుతోందన్నారు. రాజ్యాంగంలో భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా పేర్కొన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతాల పేరుతో ప్రజల మధ్య మంటలు పెడుతోందన్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా సిపిఐ పోరాడుతుందన్నారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రకుర్మయ్య, జయమ్మ, శిరీష, వెంకటమ్మ, రాంబాబు, జ్యోతి, పెంటయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.