Spread the love

డీసిల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరుగుతుండాలి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

వర్షాలు పడినప్పుడు రోడ్డు మీద నీరు నిలువ ఉండకుండా ఉండేందుకు నగరంలో నిరంతరం డీసిల్టింగ్ ప్రక్రియ జరుగుతూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం రోడ్డు, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, కోనేరు శ్రీధర్ వీధి, గురునానక్ కాలని, ఆంధ్రా లయోలా కాలేజ్ రోడ్డు, పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డీసిల్టింగ్ పనులు కచ్చితంగా జరుగుతూ ఉండాలని, వర్షాలు పడినప్పుడు నగరంలో రోడ్ల పైన ఎక్కడా నీటి నిల్వలు ఉండకుండా సైడ్ కాలవల్లో నీటి ప్రవాహం వెళ్లేటందుకు వీలుగా ఉండాలని, దానికి ముందస్తుగా మైనర్, మీడియం, మేజర్ డ్రైన్ లలో డీసిల్టింగ్ పనులు చేస్తూ, నిరంతరం కాలువలో పూడికలు తీస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రాకముందే డీసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేస్తే, వర్షాకాలంలో రోడ్లపైన నీటి నిల్వలు వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని కమిషనర్ అన్నారు.

తదుపరి కోనేరు శ్రీధర్ వీధిలో ఉన్న లక్ష్మీపతి అప్పారావు సరోజినీ నగరపాలక సంస్థ పార్క్ ను సందర్శించారు. నిర్వహణలో ఎటువంటి జాప్యం ఉండరాదని, ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, ఉద్యానవన సిబ్బంది సమన్వయంగా ఉంటూ పార్క్ నిర్వహణ సక్రమంగా చేయాలని అధికారులను ఆదేశించారు.

లయోలా కాలేజ్ రోడ్డు వద్ద గల మూడు బిన్నుల సెంటర్ లొకేషన్ ని సందర్శించారు. మూడు రంగుల చెత్తబుట్టలను అక్కడ పెట్టి ప్రజలకు అర్థమయ్యే రీతిలో వ్యర్థలు వేరు చేసే ప్రక్రియ మరియు నిర్వహణ సెంటర్ ను సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి వెంకటనారాయణ, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సామ్రాజ్యం, శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపి నాయక్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, తదితరులు పాల్గొన్నారు