Spread the love

తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టి తెలుగువారి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం -MLA బొండా ఉమ

ప్రజా నేత వంగవీటి మోహన రంగా ఆశయాలే నేటి తరం ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలన్న MLA బొండా ఉమ

ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ నందు  తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహంతో పాటు బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా సమస్యల పోరాటానికి తన ప్రాణాల సైతం అర్పించిన
స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది..

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ :-వంగవీటి మోహనరంగా ధైర్య సాహసాలతో కూడిన వ్యక్తి అని భయం అంటే తెలియని ప్రజా నాయకులు అని ఆనాడు  వివిధ జిల్లాల నుండి పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన పేద ప్రజానీకానికి ఇల్లు లేని వర్గానికి  గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి వారి అందరికీ పట్టాలు ఇవ్వాలి అని మహా ఉద్యమం చేసినటువంటి మహానేత వంగవీటి మోహనరంగా అని ఆనాడు సంఘ వ్యతిరేక శక్తులు ఆకతాయిలు రౌడీయిజం చేస్తూ మహిళల పైన ఆకృత్యాలు అత్యాచారాలు చేస్తుంటే వారి అందరిని నివారించి నగరం నుండి తరిమికొట్టిన చరిత్ర రంగా గారిది అని..

కులాలకు మతాలకు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి ప్రేమాభిమానాలు పొందడమే కాకుండా వారి సమస్యలు పరిష్కారం చేసి ఈనాటికీ చిరంజీవిగా నిలిచిన స్ఫూర్తి ప్రదాత వంగవీటి మోహనరంగా అని ఆయన చూపినటువంటి మార్గంలోనే తాను ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ముందుండి నిత్యం ప్రజలతోనే మమేకమై ఉంటున్నానని…

పేదలకు సంక్షేమం కాదు, వారిని ఆర్థికంగా, సామాజికంగా కూడా పైకి తీసుకువచ్చే విధానాలను టీడీపీ పాటిస్తుందన్నారు తెలుగుదేశం పార్టీ పెట్టిన లక్ష్యాన్ని వంద శాతం సాధించడానికి ఎప్పుడూ సరైన దారిలోనే వెళ్తోందని బొండా ఉమ తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో:- కార్పొరేటర్ మోదుగల తిరుపతమ్మ, Ex కార్పొరేటర్ పైడి తులసి, డివిజన్ అధ్యక్షులు లబ్బ దుర్గ, లబ్బా వైకుంఠం, బత్తుల కొండ, కోలా శ్రీను, Sk బచ్చ, శ్రీను,సురేష్, BDR, మోతుకూరి కాసిం, మోదుగుల గణేష్,Rk వెంకటేశ్వరరావు, తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు…