ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త,

TEJA NEWS

ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త, మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్….

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ * షాపూర్ నగర్ లోని వారి నివాసంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ
చిత్రపటానికి పూలమాల వేసే నివాళులర్పించి వారిని స్మరించుకున్నారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక, రంగాల్లో మరియు ఐటీ , టెలికమ్యూనికేషన్ రంగాల్లో భారత దేశంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి భారతదేశ అభివృద్ధికి కృషి చేశారని, అతి పిన్న వయసులోనే భారత ప్రధానిగా బాధ్యతలను చేపట్టి అనేక రంగాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top