TEJA NEWS

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంతవరకు పోరాటం ఆగదు.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్త కార్మికుల సమ్మె పిలుపులో భాగంగా జీడిమెట్ల ఇండస్ట్రియల్ కారిడార్ లో ఏఐటీయూసీ, సి ఐ టి యు, టి యు సి ఐ ల ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎండి యూసుఫ్ గారు పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు కార్మికులకు,కర్షకులకు, నిరుద్యోగులకు వ్యతిరేకమని కార్మిక సంఘాలను లేకుండా చేయడానికి 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా చేయాలని భావిస్తుందని నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా, ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను నోటిఫై చేయకుండా, రైల్వే ఉక్కు రంగాలలో రిటైర్డ్ ఉద్యోగులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో అతి తక్కువ వేతనాలకు నియమించుకోవడానికి అనుమతినిచ్చి కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని విమర్శించారు. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిందని దీని వ్యతిరేకిస్తూ దేశంలో ఉద్యోగ కార్మికులు నిర్వహించిన పోరాటాలను చల్లపరచడానికి ఏకీకృత పెన్షన్ విధానాన్ని తెచ్చిందని ఇది నూతన పెన్షన్ విధానం కంటే చెడ్డదని అన్నారు. జాతీయ కనీస వేతనం రోజుకు రూపాయలు 178గా నిర్ణయించి నెలకు 4,628 రూపాయలతో సగటు ప్రజలు జీవించవచ్చని చెప్పినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అని వెంటనే నెలకు 26 వేల జీతం గా నిర్ణయించి పిఎఫ్ పెన్షన్ రూపాయలు తొమ్మిది వేలుగా ఏ పెన్షన్ పథకాలలో రాణి వారికి కనీస పెన్షన్ రూపాయలు 6000గా నిర్ణయించాలని నూతన పెన్షన్ ఏకీకృత పెన్షన్లను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ను మోడీ ప్రభుత్వం జరపలేదని వెంటనే భారత కార్మికుల సమావేశాన్ని నిర్వహించి కార్మిక సమస్యలను చర్చించి కోట్లను అమలు చేయకుండా 12 గంటల పని దినాన్ని అమల్లోకి రాకుండా చూడాలని అన్నారు. నూతన కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులకు 12 గంటల పని దినం అమల్లోకి వస్తుందని, కార్మికులు తమ కోరికలను యాజమాన్యాల ముందు పెట్టే పరిస్థితి ఉండదని, పోరాడి సాధించుకున్న చట్టాలను హక్కులను కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. వీటిని కాపాడుకోవాలంటే పోరాటం తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడిందని కావున నేడు జాతీయ వ్యాప్తంగా జరిగిన సమ్మెలో కోట్లాదిమంది కార్మికులు పాల్గొని జయప్రదం చేస్తున్నారని ఇది ఆరంభం మాత్రమే అని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే స్వామి, సీఐటీయూ మండల కార్యదర్శి కే లక్ష్మణ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మెలో భాగంగా జీడిమెట్లలో కూడా అన్ని పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ సమ్మెను విజయవంతం చేసినందుకు కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా, కార్మిక వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నాయని అట్టి పరిశ్రమల యాజమాన్యాలు మొండివైఖరిని విడనాడి కార్మికుల కోసం పనిచేయాలని డిమాండ్ చేశారు.
సమ్మె సందర్భంగా కార్మికుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టి యు సి ఐ నాయకులు ఈశ్వర్, ఏఐటీయూసీ నాయకులు నరసింహ రెడ్డి, సాయిలు,సదానందం, బక్కరి మల్లేష్,కే శ్రీనివాస్, సుంకిరెడ్డి, మహేందర్, బోనాల కనకయ్య, చంద్రకాంత్, భీమేష్, జార్జ్, సిఐటియు నాయకులు దేవదానం, శ్రీనివాస్, కరుణాకర్, ఆంజనేయులు, అంజయ్య, స్వాతి, లక్ష్మి, సలీం తోపాటు వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.