
ఉచిత గ్యాస్ స్కీం..నెలాఖరు లోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలి..
ఏప్రిల్ నుంచి రెండవ ఉచిత గ్యాస్ బుకింగ్ ప్రారంభం..
దీపం-2 పథకంలో ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా కూడా బుక్ చేసుకోనివారు ఈ నెలాఖరులోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే మూడు ఉచిత సిలిండర్లకు గాను ఒకటి కోల్పోతారని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయని తెలిపారు.సూపర్-6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దీపం-2’ పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోగా.. వారిలో 94 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోనే సబ్సిడీ డబ్బులు జమ చేసినట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా 14 వేల మందికి సబ్సిడీ చెల్లింపులు పూర్తి కాలేదని వెల్లడించారు.
