TEJA NEWS
  • ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
  • ఉపాధ్యాయులు నిత్యం విద్యార్థులనే అని మరిచిపోవద్దు
    జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యములో ఉపాధ్యాక్షులకు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర పంచాయితీ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క


గోవిందరావుపేట మండలం

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలని, ఉపాద్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్‌ ఉంటుందని మంత్రి వర్యులు సీతక్క అన్నారు
బుధవారం గోవిందరావుపేట మండలం చల్వాయి మోడల్ స్కూల్లో అదేవిధంగా జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులకు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు
ఈ సందర్భంగా మంత్రి వర్యులు సీతక్క మాట్లాడుతూ సమాజ స్థాపనలో విద్యార్థులను ఉత్తమమైన, ఆదర్శనీయమైన విద్యార్థులుగా సిద్ధం చేయాలని సూచించారు. ఉపాద్యాయులు ఉత్తమ విద్యార్థులను తయారు చేయగలుగుతారని, సామర్థ్యాల పెంపుకై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఉపాద్యాయుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని, తాను నేర్చుకుంటూ విద్యాబోధన చేసినప్పుడే విద్యార్థులలో గుణాత్మకమైన మార్పు సాధించవచ్చునన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు, నూతన విషయాలను తెలియజేస్తాయని, ప్రతి ఉపాద్యాయుడు శిక్షణలో అందిస్తున్న అంశాలను ఆకలింపు చేసుకొని పాఠశాల స్థాయికి తీసుకెళ్లి విద్యార్థుల్లో ఆశించిన మార్పుల సాధన లక్ష్యంగా పని చేయాలని సూచించారు
ఈ కార్యక్రమములో జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్
జిల్లా విద్యా శాఖ అధికారి ఫణిని తో మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు