
రామచంద్రపురం డివిజన్ మల్లికార్జున నగర్ కాలనీ లో ఉన్న నాలాలలో చెత్తను తొలగించడానికి మరియు శుభ్రం చేయించడానికి జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారు 40.00 లక్షతో లింగంపల్లి కనుకుంటా నుంచి సాయి జ్యోతి నగర్ కాలనీ ఉస్కేబావి వరకు ఉన్న నాలాలో డిసిల్టింగ్(నాలా పూడికతీత) పనులలో భాగంగా స్థానిక కార్పొరేటర్,జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబెర్ బూరుగడ్డ పుష్పనగేష్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డీఈ నరేందర్ మరియు కాలనీ వాసులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.అలాగే ఈ ఎండాకాలంలో చెత్త చెదారం ఎక్కువ ఉండడంతో నాలా చుట్టుప్రక్కల ప్రజలు తీవ్రమైన దుర్వాసనతో మరియు దోమల బెరడ నుంచి ప్రజలను రక్షించడానికి,రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ డిసిల్టింగ్ పనులు జరిపిస్తున్నాం అని కార్పొరేటర్ తెలిపారు.వారితో బాల్ రెడ్డి,సత్యనారాయణ,అరుణ్ సింగ్,కిష్ట రెడ్డి,వెంకటేశ్వర్లు,శ్రీను,కృష్ణ రెడ్డి,బలరాం,రాములు,బసవరాజ్,బాగయ్య,రాజేశం,బాలు తదితరులు.
