Spread the love

దుండిగల్ గ్రామంలో రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకున్న సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి అభ్యర్థన మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా ప్రభుత్వం మెడలు వంచి బీజేపీ పార్టీ మరియు మీ స్థానిక ఎంపీ గా రైతుల పక్షాన అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది గత 50 సంవత్సరాలుగా అదే జీవనాధారంగా మూడు తరాలు జీవిస్తు భూమితో ఎంతో అనుబంధం ఏర్పరచుకున్న రైతులు కన్యాక్రాంతంగా ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా లాక్కోవడం బీజేపీ పార్టీ తరపున ప్రభుత్వాన్ని కండించడం జరిగింది

డా ఎస్ మల్లారెడ్డి గారు మాట్లాడుతూ బౌరంపేట్ లో 166 సర్వే నెంబర్ లో లావణ్య పట్టా ప్రస్తుతం దుండిగల్ పరిస్థితి ఎలాంటి నోటీసులు గాని పరిహారం గాని ఇవ్వకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబల్ బెడ్ రూమ్ కోసమని, డంపింగ్ యాడ్ కోసమని, మైనింగ్,గ్రేవియార్డ్,వాటర్ వర్క్ కోసం ఇట్ల ఒక్కొక్కరు ఒక్కొక్కరు గా అనేక మందిని కాలి చేయించి బలవంతంగా లక్కోవడం జరిగింది కొందరు నాది పోలేదనే ఉద్దేశం తో కొందరు సైలెంట్ ఉండడం వలన రైతులు అందరు నష్టపోవాల్సి వస్తుంది అప్పుడు బీఆర్ఎస్ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది కావున అందరు సంగటితమై పోరాడితే తప్ప సమస్య పరిష్కారం కాదని మీకు బీజేపీ అండగా ఉంటుందని సూచించారు

ఈ కార్యక్రమం లో రైతులకు మద్ధతుగా జిల్లా ప్రధాన కార్యదర్శి డి విగ్నేశ్వర్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి,కొంపల్లి మాజీ కౌన్సిలర్ రాజిరెడ్డి గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ కావలి గణేష్, కార్పొరేటర్ మహేందర్,విజయలక్ష్మి,బీజేపీ నాయకులు ఆకుల మల్లేష్,ప్రభాకర్ రెడ్డి,భాను గౌడ్,శ్రీధర్, యువమోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల విజయ్,వెంకటేష్ నాయక్,యశ్వంత్, విష్ణు, అఖిల్ గ్రామ ప్రజలు బాధితులు తదితరులు పాల్గొన్నారు