
ఆర్థికమాంద్యంతో ఆదాయం తగ్గిందని ప్రభుత్వం చెబుతుందని…, కానీ ఇది పాలకుల బుద్ధిమాంద్యం అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు..
ఇచ్చిన హామీలు అమలు చేసే దిక్కులేదు వాటికి సరిపడా ఆదాయం లేదని చెప్తుంది, ఆదాయం ఎందుకు లేదంటే ఆర్థికమాంద్యం అంటుంది.., కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థికమాంద్యం తెలంగాణలోని ఎందుకు ఉంటుంది…, ఇది ఆర్థికమాద్యం కాదు పాలకులకు బుద్ధిమాంద్యం.., అంతా తనకే తెలుసు అనుకునే సీఎం అజ్ఞానం, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రఆదాయం దిగజారింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థికమాంద్యం మాట ఎత్తుకున్నారని హరీష్ రావు ఘాటుగా విమర్శించారు.
ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు కాని అందాల పోటీలా..!!
బిఆర్ఎస్ హయాంలో కొన్ని భూములను అమ్మితేనే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు 50 వేల కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం అమ్మేస్తున్నారు ఇది దిగజారుడు రాజకీయం కాదా..!!
రాష్ట్రంలో వ్యవసాయ విధ్వంసంతో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైడ్రా విధ్వంసంతో పేద, మధ్యతరగతి జనం గుండె ఆగి చనిపోతున్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలడంతో రియల్టర్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరైన తిండి లేక హాస్టల్ లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఇది రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను విధ్వంసం చేయడం కాదా…
రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ మొహబ్బత్ దుకాణ్ (ప్రేమదుకాణం) అంటుంటే..! రేవంత్ మాత్రం నఫ్రత్ కా మఖాన్ (విద్వేషాలఇల్లు) అంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు..
