బుధ. మార్చి 11th, 2026

ప్రభుత్వం ప్రతిష్టసాత్మకంగా చేపట్టిన సన్నం బియ్యం

WhatsApp Image 2025 04 01 at 13.32.18
WhatsApp Image 2025 04 01 at 13.32.18
TEJA NEWS

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టసాత్మకంగా చేపట్టిన సన్నం బియ్యం కార్యక్రమాన్ని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు , స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యా రాణి తో కలిసి ప్రారంభించారు….

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు…

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-….

రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న గొప్ప సంకల్పంతో చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించారు అన్నారు…

పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తు అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంది అన్నారు…

వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2,70,148 మంది ప్రజలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నట్టు ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు….

ఏ ప్రభుత్వాలున్నా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం. పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు….

పేదలు దొడ్డు బియ్యం తినలేరు. పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం. ఈ గడ్డ మీద నుంచి ప్రారంభించిన పథకాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి పేదవారికి అండగా ఉంటాము అన్నారు….

దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. రైతుల శ్రమ ఎక్కడికీ పోదు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశాం. మొదట్లోనే 7,625 కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించాం. రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచిన గొప్ప ప్రజా ప్రభుత్వం అన్నారు….

రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని రైతులను ప్రోత్సాహకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అన్నారు….

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, నాయకులు మహమ్మద్ చోటే, పోశాల వెంకన్న గౌడ్, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు….

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page