
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం….
2.5 కోట్లు వ్యయం తో సిటీ స్కానింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ….
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2.5 కోట్లు వ్యయం తో నూతన సిటీ స్కానింగ్ ను ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ హాజరయ్యారు.
ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ సిటీ స్కానింగ్ కేంద్రము ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది .
సిటీ స్కానింగ్ ను కంప్యూటర్ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ పరిశీలించడం జరిగింది …
ఎమ్మెల్యే మాట్లాడుతూ ……
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు పొందాలన్న దృష్టి తో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. సి.టి స్కానింగ్ యంత్రం ప్రారంభం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు.
గద్వాల ప్రాంతంలో నిరుపేద ప్రజలు సిటీ స్కానింగ్ కొరకు కర్నూలు హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి వేల రూపాయలను ఖర్చు పెట్టుకుని పేద ప్రజలు స్కానింగ్ చేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్ని రకాల పరీక్షలను స్కానింగ్ లను ప్రజలకు ఎలాంటి ఖర్చు లేకుండా మెరుగైన సేవలను అందించాలని దురదృష్టం ఆలోచించి ఈ ప్రాంతంలోని ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు సిటీ స్కానింగ్ కొరకు ప్రైవేట్ సంస్థలకు వెళ్లకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి వారి స్కానింగ్ నిర్వహించుకోవాలని ప్రభుత్వము రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి పేద ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని కావున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భవిష్యత్తులో ఈ ప్రాంతంలోని నిరుపేద ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా గద్వాల ప్రభుత్వాసుపత్రి లోని అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలను స్కానింగ్ లను ప్రభుత్వ ఆస్పటల్ చేసే విధంగా వైద్యులను అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ….
జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, ఎమ్మెల్యే సహకారంతో సిటీ స్కానింగ్ ఏర్పాటు చేసుకోవడం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన రోగ నిర్ధారణ సేవలను అందించడానికి అత్యాధునిక కంప్యూటర్స్ టోమోగ్రఫీ సి.టి స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రోగులకు నాణ్యమైన, ఖచ్చితమైన రోగనిర్ధామ సేవలు అందించవచ్చని సూక్ష్మమైన లోపాలను కూడా ఇది గుర్తించగలదని తెలిపారు. దీని ద్వారా రోగులకు తగిన వైద్య చికిత్సలు వేగంగా అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. గతంలో సిటీ స్కానింగ్ పరీక్షల కోసం ప్రజలు ఇతర పట్టణాలకు వెళ్లాల్సి ఇప్పుడు అదే సౌకర్యం స్థానికంగా లభించడంతో ప్రజలు సమయం, ఖర్చును ఆదా చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో ఈ సేవలు లభించడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉంటుందని పేర్కొన్నారు.ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని విభాగాల వైద్యులు తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
కావున ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, మాజీ ఎంపీపీ విజయ్ మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, ఆనంద్ గౌడు, మాజీ కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు,దౌలు, సాయి శ్యామ్ రెడ్డి, శ్రీను, నరహరి గౌడ్, పూడూరు కృష్ణ, రామకృష్ణ శెట్టి, రిజ్వాన్, సుధాకర్ సుదర్శన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆంజనేయులు, ఆలయం కమిటీ డైరెక్టర్ వెంకటేష్, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి , గోవిందు, వంట భాస్కర్, సంగాల నర్సింహులు, రామాంజనేయులు, గంట రమేష్, మోబిన్, పవన్ యాదవ్, మధు , కిరణ్, గాంధీ ,వీరేష్, ప్రవీణ్, గువ్వల గోపాల్, ఆంజనేయులు మోహన్ యాదవ్, mkప్రవీణ్ మన్యం, మొయినుద్దీన్, షాషా , చిరు , రాజు, నాగార్జున్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
