అరుణోదయ ప్రింటింగ్ ప్రెస్ అధినేత లోక్ సత్తా పార్టీ సీనియర్ నాయకులు

TEJA NEWS

అరుణోదయ ప్రింటింగ్ ప్రెస్ అధినేత లోక్ సత్తా పార్టీ సీనియర్ నాయకులు దండు వెంకట సురేష్ వర్మ సంతాప సభలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్….

కొంపల్లి లోని హైందవ నిమంత్రన్ లో ఏర్పాటుచేసిన సురేష్ వర్మ సంతాప సభలో మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని, వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురేష్ వర్మ సమాజంలో గౌరవప్రదంగా జీవించారని, సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు బలహీ వర్గాల అభ్యున్నతికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు అని గుర్తు చేసుకున్నారు…

ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్ తో పాటు గోపాల్, వెంకట్ రాజు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top