
అసంఘటిత కార్మికుల సంక్షేమానికి పెద్ద ఎత్తున పథకాల అమలు.
- ఏపీలో 83,29,407 మంది అసంఘటిత కార్మికులు.
- ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి.
దిల్లీ /ఏలూరు, : అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే సోమవారం సమాధానం ఇచ్చారు.
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ eshram.gov.in పోర్టల్ ను 2021 ఆగస్టు 26న ప్రారంభించి, అసంఘటిత కార్మికుల సమగ్ర వివరాలను ఆధార్ తో అనుసంధానం చేసిందని, అసంఘటిత కార్మికులకు స్వీయ అనుమతితో యూనివర్సల్ అకౌంట్ నంబర్ రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు కేంద్ర మంత్రి బదిలిచ్చారు.
2025 మార్చి3 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 83,29,407 మంది, దేశవ్యాప్తంగా 30.71 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
అసంఘటిత కార్మికుల సంక్షేమం ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్, బీడీ, సినీ, నాన్ కోల్ గనుల కార్మికుల సంక్షేమం, ఆరోగ్య సంరక్షణకు ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఒక దేశం-ఒక రేషన్ కార్డు పథకం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన,మహాత్మా గాంధీ బుంకర్ బీమా యోజన, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, పీఎం స్వనిధి, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన,మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం నిర్దిష్ట పథకాలను అమలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.
అసంఘటిత కార్మికులకు అవగాహన కల్పించడానికి కాలానుగుణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం, స్టేట్ కామన్ సర్వీసెస్ సెంటర్ అధిపతులతో నిరంతర సమావేశాలు, అవగాహన శిబిరాలను నిర్వహించడం, నమోదును సులభతరం చేస్తున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఇట్లు
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయం,
ఏలూరు.
