బుధ. మార్చి 11th, 2026

మిల్లుల అలాట్మెంట్ చేయట్లేదు

WhatsApp Image 2025 04 24 at 11.20.51
WhatsApp Image 2025 04 24 at 11.20.51
TEJA NEWS

మిల్లుల అలాట్మెంట్ చేయట్లేదు

ఏ అధికారులు స్పందించట్లేదు

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం పోసిన అన్నదాత ఆవేదన

ధాన్యం కేంద్రాల్లో అన్ని సమస్యలే

సూర్యాపేట జిల్లా : రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలంటే ప్రభుత్వానికి అధికారులకు ప్రజాప్రతినిధులకు ఐకెపి కేంద్రాల నిర్వహకులకు తలపానం తోకకు వస్తోంది.కేంద్రాలకు వచ్చిన ధాన్యం ఎందుకు ఎగుమతి కావట్లేదు అని అందరూ సందిగ్ధంలో పడ్డారు.ప్రధాన సమస్య ఎక్కడుందో అధికారులకు తెలియకుండా ఎలా ఉంటుంది ఆ సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది కదా అని రైతుల అంతరంగంలో ఆవేదన రగులుకుంటుంది.
మిల్లుల అలాట్మెంట్ చేయకపోవడంతోటే 80% ఐకేపీ కేంద్రాలలో ధాన్యం రాశుల్లో కుప్పలు కుప్పలుగా కనబడుతున్నాయి. మిల్లర్లు ఎందుకు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవట్లేదు ఈ కారణం ప్రభుత్వానికి తెలియదా…? అధికారులకు తెలియదా…? అంటే తెలియకుండా ఎలా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం ఇదే పరిస్థితి నెలకొన్నదని రైతు సంఘం వర్గాల నుండి తెలుస్తోంది. అసలే వాతావరణం ఎప్పుడు ఎలా మారనుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు కురిసి అపార నష్టం జరగకముందే ప్రభుత్వం త్వరితగతిన రైతులను కేంద్రాల నుండి బయటపడేయాలని ఆలోచన ఎవరూ చేయట్లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.పండించిన పంటకు మద్దతు ధర వస్తుందని ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రభుత్వ సూచనల మేరకు నిబంధనల ప్రకారం ఐకెపి కేంద్రాలలో ధాన్యం పోస్తే దాదాపు 20 రోజులు గడుస్తున్న తాము ఇంకా కేంద్రాలలోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు జిల్లా అధికారులు ప్రత్యేక అధికారులు ప్రజా ప్రతినిధుల మని కేంద్రాలకు వస్తున్నారు.చూస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు.వెళుతున్నారు ఉచితంగా సలహాలు సూచనలు ఇస్తున్నారు.కానీ పనులు మాత్రం జరగట్లేదు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించే పరిస్థితులు లేవా అని రైతులు తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నమ్మితే నమ్మినట్లే చేస్తున్నారని లోలోపల మదన పడుతున్నారు.ఎక్కడో ఒకచోట కేంద్రాలు సజావుగా సాగుతున్నాయి.ఎక్కువగా కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. కేంద్రాలలో పోసిన ధాన్యం రాశుల వైపు చూసిన ప్రతి ఒక్కరికి హృదయం ద్రవించక తప్పదు.గతానికంటే గతం లాగే ఇప్పుడు ధాన్యం బాగానే పండినందున రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ధాన్యం రాశులు కనపడుతున్నాయి.

నానా యాతనలు పడుతున్న నిర్వాహకులు

ఖరీఫ్ సీజన్లో కంటే ఈ రబీ సీజన్లో కేంద్రాల నిర్వహకులు సైతం ఈసారి కేంద్రాలు నిర్వహించాలంటే తలనొప్పిగా మారింది. అధికారులతో ప్రజాప్రతినిధులతో అన్నదాతలతో హమాలీలతో నానాయాతనలు పడుతున్నారు. ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు అందరూ వచ్చి తమ పైనే పడితే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన చెందుతున్నారు.వచ్చిన ప్రతి ఒక్కరూ సమస్యల పరిష్కారానికి కృషిచేసి రైతులకు తమకు సహకరిస్తే కేంద్రాలు సజావుగా సాగుతాయని కోరుకుంటున్నారు.ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుకుందాం….

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page