
కనీస వేతనం రూ.26వేలు చేయాల్సిందే
** నల్లగొడుగులు, నల్ల బట్టలతో కార్మికుల సమ్మె
తిరుపతి: దేశంలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులు, కార్మికులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనాన్ని తక్షణం రూ. 26వేలు చేయాల్సిందేనని
సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర,
అప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.చిన్నబాబులు డిమాండ్ చేశారు. దేశంలోని పెట్టుబడిదారు ప్రయోజనాల కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మోడీ విధానాలను నిరసిస్తూ నల్ల దుస్తులతో, నల్లగొడుగులతో ఆర్ట్స్ కాలేజ్ నుంచి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు. తిరిగి జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం మీదుగా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం మీదుగా నాలుగు కాళ్ల మండపం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.హేమలత, సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర,
అప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.చిన్నబాబు,
కాంటాక్ట్ – అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ జి.నాగ వెంకటేష్, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.సాయిలక్ష్మి, పంచాయితీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాము, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అమర
తదితరులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన 2022 సమ్మెకు ఈ సమ్మె వ్యత్యాసం ఉందని,
16 డిమాండ్లు ఉన్న అన్నిట్లోనూ లేబర్ కోడ్స్ అడ్డుకోవడమే ప్రధానమైన అంశం అని అన్నారు.
లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే చట్టాలు వర్తించని కార్మికులు అందరూ కూడా బానిసత్వంలోకి నెట్టబడతారన్నారు.
పని ప్రదేశంలో కార్మికులకు రక్షణ, ఆరోగ్య భద్రత, పనిగంటలు, వారాంతపు సెలవులు, లీవులు తదితర హక్కులను కోల్పోతారని పేర్కొన్నారు. దీని ఫలితంగా కార్మికులు వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛనిచ్చే లేబర్ కోర్టులో రద్దు కావాలి కొత్తగా ఫ్యాక్టరీల్లో తామనుకున్నంత కాలం కార్మిక చట్టాల అమలు కాకుండా నిర్దేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని అన్నారు. కార్మిక హక్కులపై దాడి… ఇది గొడ్డలి పెట్టు లాంటిది…. అని వ్యాఖ్యానించారు. కార్మిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వాలు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.
రాష్ట్రంలో, దేశంలో కాంటాక్ట్ కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వెల్లడించారు. చట్ట ప్రకారం పర్మినెంట్ కార్మికులు చేసే పనిని కాంటాక్ట్ కార్మికులు కూడా చేస్తున్నా….పనికి తగిన వేతనం అందక ఆర్ధిక, మానసిక, అనారోగ్య సమస్యలు పడుతున్నారని ఆవేదన చెందారు.
కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే వేతనాలు, అలవెన్సులు, బెనిఫిట్ లు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చింది…. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరపడం లేదు.
దీనివల్ల కార్మిక లోకం తీవ్రంగా నష్టపోతున్నది….
కాబట్టి కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి పర్మనెంట్ విధానాన్ని అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు అమర, శాంతమ్మ, పద్మని, ప్రసన్న, మునిషా, విజయనిర్మల, ఎస్వీ యూనివర్సిటీ కాంటాక్ట్ వర్కర్స్ నాయకులు రాజేంద్ర, మునయ్య, గణేష్,
అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, వరలక్ష్మి, మునిలక్ష్మి, నాగరత్నమ్మ, చంద్రమ్మ, అనురాధ, ఆప్కాస్ నాయకులు నాయుడు, నందు బాబు,
పంచాయతీ కార్మిక సంఘం నాయకులు నాగభూషణం, దయాకర, యోగ, కిరణ్, వెంగమ్మ, ధనమ్మ, తిరుపతి గైడ్స్ యూనియన్ నాయకులు బాలాజీ, సురేష్, ఏకాంతరావు, శ్రీనివాసరెడ్డి, హరి, రంజిత్, జగదీష్, రాజారెడ్డి, శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు యూనియన్ నాయకులు యుగంధర్, పెంచలయ్య, ప్రకాష్, రామ్మూర్తి, రాంబాబు భాష తదితరులు పాల్గొన్నారు.
