
ప్రధానికి దైవబలం పెరగాలని ఎమ్మెల్యే మొక్కు
తిరుపతి:
ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్థాన్ కు గుణపాఠం నేర్పిన సైనికులకు, దేశాన్ని ఏకతాటిపై నిలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదికి తిరుత్తుణి సుబ్రమణ్య స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సైనికులకు, దేశ నాయకత్వానికి దైవబలం తోడుగా ఉండాలని షష్ఠ షణ్ముక ఆలయాల్లో పూజలు చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో తిరుత్తుణి సుబ్రమణ్య స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ పహల్గాంలో 26మంది పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చిన తీరు పవన్ కళ్యాణ్ ను కలిచి వేసిందన్నారు.
ఆయుధసంపత్తి, సాంకేతిక పరిజ్జానం సైనికులకు ఉన్నా దైవబలం ఉండాలనే సంకల్పంతో షష్ట షణ్ముక ఆలయాల్లో జనసేన ప్రజాప్రతి నిధులు మంగళవారం పూజలు నిర్వహించి ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. సైనికులతో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దైవబలం మెండుగా ఉండాలని తిరుత్తణి సుబ్రమణ్య స్వామిని మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. దేశరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలను జనసేన బలపరుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాతినేని వెంకటేశ్వర రావు, ఎస్సీ కార్పోరేషన్ డైరక్టర్ యుగంధర్, వన్నెకుల క్షత్రియ కార్పోరేషన్ డైరక్టర్ బాలసుబ్రమణ్యం, కార్పోరేటర్లు నరసింహాచ్చారి, నరేంద్ర, జనసేన కార్పోరేటర్లు ఎస్.కె.బాబు, సికే రేవతి, దూది కుమారి, పొన్నాల చంద్ర, కుడితి సుబ్రమణ్యం, వరికుంట్ల నారాయణ, తిరుత్తణి వేణుగోపాల్, దూది శివ కుమార్, యాదవ కృష్ణా, సికె రవి, రాజారెడ్డి, హరిశంకర్, ఆకేపాటి సుభాషిణి, కీర్తన, ఆకుల వనజ, బాబ్జి, కెఎంకే కుమార్, ఆర్కాట్ కృష్ణప్రసాద్, పగడాల మురళీ, రాజేష్ యాదవ్, సుధాకర్, నగరి పిఓసి మెరుపుల మహేష్త, లక్ష్మీపతి, మునస్వామి, రాజేష్ ఆచ్చారి తదితరులు పాల్గొన్నారు.
