TEJA NEWS

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండలంలోని మల్లెపల్లిలొ జై భీమ్ జై బాపు సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు, అనంతరం వెల్దండ మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు, అంతేకాకుండా జెపి నగర్ లో కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు, ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా రైతులకు ఉపయోగపడే విధంగా మేము బాధ్యత తీసుకుంటామంటూ ఎంతమంది ఎన్ని తీసుకువచ్చినా ఎన్ని లారీలు వచ్చిన మేము ఏ ఒక్క రైతుకు ఇబ్బంది పెట్టము అంటూ ఆయన వాక్యాన్ని ఇచ్చారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ మెంబర్ ఠాగూర్ బాలాజీసింగ్, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కల్వకుర్తి టౌన్ ప్రెసిడెంట్ చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.