TEJA NEWS

పట్టణం లో ని రోడ్లపై పేరుకుపోయిన బురద వరద
కమిషనర్ వార్డులలో పర్యటించి చర్యలు తీసుకోవాలి

చిలకలూరిపేట పట్టణం లో వేకువ జామున కురిసిన వర్షానికి పట్టణం లోని రోడ్లన్నీ వర్షపు నీటి తో నిండిపోయాయి.

మార్కెట్ సెంటర్, రైస్ కోట్ల బజారు లో మొత్తం వర్షం నీరు వచ్చింది. రోడ్లన్నీ వరద (బురద) తో నిండిపోయింది.
ఆ ప్రాంతం లో పారిశుధ్య కార్మికులు పూడిక తీయలేదు.
అక్కడ ఉన్న కల్వర్ట్ లో వ్యర్ధాలు పేరుకుపోయి ఉండడం తో ఈ సమస్య ప్రతి సారి తలెత్తుతుంది.

కొట్ల ముందు కాలువలో పూడిక, ఈ కల్వర్టు లో ఉన్న పూడిక తీస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

మున్సిపల్ కమిషనర్ శ్రీహరి స్పందించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.