నూతన డీఎస్పీని సన్మానించిన…… టీజేఎస్ జిల్లాఅధ్యక్షులుఖాదర్ పాష.

TEJA NEWS

నూతన డీఎస్పీని సన్మానించిన…… టీజేఎస్ జిల్లాఅధ్యక్షులు
ఖాదర్ పాష.
వనపర్తి :
వనపర్తి జిల్లా నూతన డి.ఎస్.పి గా కొద్ది రోజులు క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన వనపర్తి. డీఎస్పీ జి.గిరిబాబు ని తెలంగాణ జన సమితి (TJS) జిల్లా అధ్యక్షులు ఎం.ఏ. ఖాదర్ పాష సోమవారం మర్యాదపూర్వకంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీఎస్పీ ని కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
​ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష మాట్లాడుతూ… జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు నూతన డీఎస్పీ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, మత్తు పదార్థాల (డ్రగ్స్) విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, వాటిని జిల్లా నుండి పూర్తిగా నిర్మూలించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో నేరాల నియంత్రణకు మరియు ప్రజల భద్రతకు కీలక జంక్షన్లలో, సమస్యాత్మక ప్రాంతాలలో సీసీ కెమెరాలను మరింత విస్తృతంగా ఏర్పాటు చేయాలని కోరారు.


​పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్య ప్రజలకు, బాధితులకు పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆయన ఈ సందర్భంగా డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సమస్యలపై పోరాడే తమ పార్టీ తరపున పోలీసు విభాగానికి, శాంతిభద్రతల పరిరక్షణకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
​తమను కలిసి సన్మానించి, స్థానిక అంశాలపై సానుకూలంగా స్పందించిన. టీజేఎస్ నాయకులు .డిఎస్పీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లాలో చట్టన్ని గౌరవిస్తూ. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామని డిఎస్పి హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు య౦ఏ ఖాదర్ పాషతో పాటు
రతన్ నాయక్..
ఉద్యమ నాయకులు చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top