TEJA NEWS

నిజామాబాద్ జిల్లా లోని బోధన్ లో నూతనంగా నిర్మించిన కమ్మసంఘం భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ మండవ వెంకటేశ్వరరావు గారు, గౌరవ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు,కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య ,తెలంగాణ గౌరవ అధ్యక్షులు శ్రీ సి వి రావు గారు,గౌరవ రాష్ట్ర హస్తకళల మాజీ చైర్మన్ శ్రీ అమర్ నాథ్ బాబు గారు, గౌరవ బోధన్ కమ్మ సంఘం అధ్యక్షులు శ్రీ పల్లెంపాటి శివన్నారాయణ గారు, గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు,గౌరవ మాజీ కార్పొరేటర్ శ్రీ కొత్త రామారావు గారు ,గౌరవ ఉదయ్ హైట్స్ అధినేత శ్రీ ముమ్మలనేని రాజశేఖర్ గారు మరియు కమ్మ సంఘం ప్రతినిధులతో కలిసి పాల్గొని బోధన్ కమ్మ సంఘం భవనం ను ప్రారంభించి మరియు తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు , స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య ,తెలంగాణ అధ్యక్షులు గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

ఈ సందర్భంగా కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు మాట్లాడుతూ బోధన్ కమ్మసంఘం వారు నూతనంగా నిర్మించిన కమ్మసంఘం భవనం ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని , అన్ని హంగులతో సకల సౌకర్యాలతో నిర్మించుకోవడం జరిగినది అని ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆని, చిన్న చిన్న సమావేశాలు, వివాహాది శుభకార్యాలు, బర్త్ డే వంటి ఫంక్షన్ లు నిర్వహించుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది అని, మరియు విడిది కోసం రూములు ఏర్పాటు చేయడం జరిగినది అని ప్రతి ఒక్కరి కి అందుబాటులో ఉంటుంది అని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, భవనం నిర్మాణం కోసం సహకరించిన దాతలకు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను అని , పేద విద్యార్థులకు వసతి గృహం తో పాటు ఉచిత భోజనం, వసతి, దుస్తులు పంపిణీ చేయడం అనేక సామాజిక కార్యక్రమాలు నిరవహిస్తున్న బోధన్ కమ్మ సంఘం సభ్యులను ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.

తెలుగుజాతి ఇలవేలుపు, మరణం లేని జననం,తెలుగుజాతి కీర్తి మకుటం, తెలుగునేల ముద్దుబిడ్డ, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు , స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన మాహానుభావుడు , విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు గారు అని, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో, విశ్వ విఖ్యాత నట సార్వాభౌమునిగా యావత్ ప్రపంచానికి ఆయన ఒక కళాప్రవీనుడిగా, కుల,మత బేధం లేకుండా అందరి అభివృద్ధి కోసం కృషి చేసిన సాక్షాత్ భగవత్ స్వరూపుడుగా అందరివాడు . ఎంతో మందికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని PAC చైర్మన్ గాంధీ గారు కొనియాడారు.రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు, పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం కైవసం చేసుకొని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నానుడి నిజం చేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయం గా ముందుకు వెళ్లారని బడుగు బలహీన వర్గాలకు, యువత కు రాజకీయ అవకశాలు కలిపించి కొత్త అధ్యాయం ఎన్టీఆర్ గారుసృష్టించారని ,
మరణం లేని జననం.
తెలుగువాడి కీర్తిని నలుదిశలా ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన యుగపురుషుడు ఎన్టీఆర్ గారు అని,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మహానుభావుడు అని ,పేదవాడు బ్రతకడానికి కనీస అవసరాలైన తిండి, గూడు, బట్ట అని నమ్మి వాటిని కల్పించి వారి జీవితాలలో వెలుగు నింపారని, అభివృద్ధి ,సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన అందించిన పరిపాలన దక్షకుడు అని, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారాని, ఆస్తి హక్కు కలిపించారని, మహిళలకు రిజర్వేషన్ ,మహిళ సాధికారికథకు విశేష కృషి చేసిన మహాను బావుడు ఎన్టీఆర్ గారు అని PAC చైర్మన్ గాంధీ గారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి వెంకటేశ్వరరావు గారు, పునుకొల్లు నాగభూషణం గారు,పాతూరు వెంకట్రావు గారు, పొట్లూరు పాండురంగారావు గారు , తాళ్లూరి జీవన్ కుమార్ గారు ముప్పనేని అప్పారావు గారు, పోలవరపు శ్రీనివాస ప్రసాద్ గారు, ప్రభాకర్ గారు మరియు నాయకులు, బోధన్ కమ్మసంఘం ప్రతినిధులు, కమ్మ సంఘం సోదరులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.