TEJA NEWS

జననేతకు జనం జేజేలు,
ఎమ్మెల్యే వివేకానంద కి పార్టీ విప్పుగా నియమితులైన సందర్బంగా నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట బషీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని ఇటీవల పార్టీ విప్పుగా నియమితులైన సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, అభిమానులు, ఆయనను కలుసుకుని అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అనంతరం వివిధ కాలనీలు బస్తీలు నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే కి విన్నవించుకోగా ఆయన తక్షణమే సంబంధిత అధికారులకు వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు..

అలాగే నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు సంక్షేమ సంఘం నాయకులు అభిమానులు తమ ఇంట్లో జరుపుకునే శుభకార్యాలకు మరియు ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు రావాల్సిందిగా ఎమ్మెల్యే కి ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ ప్రజల సేవలో నిరంతరం ఉంటానని వారికి తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు సంక్షేమ సంఘాల నాయకులు, సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..