Spread the love

పల్లె బాటలో “జన” ప్రభంజనం

ప్రజలకోసం పల్లెబాట పట్టిన ఎమ్మెల్యే బలరామకృష్ణ…

కూనవరం గ్రామంలో ఇంటింటా పర్యటన..అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు.. పలువురికి ఆర్ధిక సహాయం అందజేత

అవినీతి రహిత పాలన అందించడమేమా లక్ష్యం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎలాగైతే నిత్యం ప్రజల్లో మమేకమవుతూ ప్రజల మధ్య తిరిగారో… ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా.. నేను మీ మనిషిని, మీ వాడిని అని చాటి చెబుతూ.. నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ…ఎక్కడికక్కడ వాటికి పరిష్కారాన్ని చూపిస్తూ.. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో ముందడుగు వేస్తున్నారు. ఈరోజు చేపట్టిన పల్లెబాట కార్యక్రమంతో మళ్లీ జనంతో మమేకమయ్యారు..

సీతానగరం మండలం కూనవరం గ్రామంలో పల్లెబాట కార్యక్రమానికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ కూటమి నేతలతో కలిసి ప్రతి ఇంటిని టచ్ చేస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ.. పాదయాత్రగా సాగారు. గ్రామంలో ఉన్న డా.బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.. అలాగే గ్రామంలో జనవాణిని నిర్వహించి అక్కడికక్కడే అర్జీలను స్వీకరించి, ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించదగిన సమస్యలను పరిష్కరించారు. కొన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు. పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధ పడుతున్న పలువురికి నేనున్నాను అంటూ భరోసా కల్పించి ఆర్ధిక సహకారం అందించడం జరిగింది..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ.. మా ప్రతి అడుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తాను ఎమ్మెల్యేగా గత పాలకుల మాదిరిగా కాకుండా అవినీతికి తావులేని పాలనను అందిస్తున్నట్లు తెలిపారు. గడచినా పది నెలల్లో అభివృద్ధి అంటే ఇలా ఉండాలి.. అని చూపించే విధంగా అనేక అభివృద్ధి పనులను నియోజకవర్గానికి తీసుకురావడం జరిగిందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, తదితర అన్ని రంగాల్లోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చానన్నారు. ఐటిఐ కళాశాల, అలాగే డిగ్రీ కళాశాలలు, రహదారుల నిర్మాణం, ఇలా అనేక సౌకర్యాల కల్పనకు అడుగులు వేయడం జరిగిందన్నారు. రైతాంగానికి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించడానికి ఎత్తిపోతల పథకాల ప్రక్షాళనకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్న గ్రామాల్లో రక్షిత మంచినీటిని అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తమ హయాంలో ఈ ఐదేళ్లలో చేసే అభివృద్ధి.. 30 ఏళ్లు గుర్తుండిపోయేలా నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే టాప్ లో నిలబెడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.