TEJA NEWS

గంగ్వార్ లో ఎగిరిన గులాబీ జెండా …. కదం తొక్కిన గులాబీ సైన్యం…

తాండూర్ నియోజకవర్గం గంగ్వార్ గ్రామం లో “ఛలో వరంగల్” రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పి రంగారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జెండా ఊపి ప్రారంభించాయి.

ఈ సందర్భంగా పలువురు బి ఆర్ ఎస్ కార్యకర్తలు మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా 2001 లో తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఆధ్వర్యంలో స్థాపించబడిన బిఆర్ఎస్ పార్టీ అనంతరం ఎన్నో ఆటుపోట్లు, త్యాగాల నడుమ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని.. అదే స్ఫూర్తితో, అకుంఠిత దీక్షతో బంగారు తెలంగాణగా మార్చిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు . తెలంగాణ రాష్ట్ర సంక్షేమం,అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమని వ్యాఖ్యానించారు. అనంతరం చలో వరంగల్ రజతోత్సవ వేడుకలకు అసంఖ్యాకంగా తరలివస్తున్న బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులకై ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పి. రంగారెడ్డి, ఇ.భీమ్ రెడ్డి, కే.గోపాల్ రెడ్డి, ఇ. సుదర్శన్ రెడ్డి, పి.భీమిరెడ్డి, తలారి విట్టల్, ఉరడి నర్సింలు, లోవడ అంజులప్ప, మాల మొగులప్ప, తలారి రాములు, మాల అంజిలప్ప, మాల ఉదయ్, మాల నరసింహ, మాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.