TEJA NEWS

సైనికుల త్యాగాలను అవమానపర్చడం, రాజకీయం చేయడం బిజెపికి తగదు.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
భారతదేశ శాంతిభద్రతల కొరకు తమ ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ దేశ సేవ కోసం పనిచేసేటువంటి దేశ సైనికులు మోడీ కాళ్లు మొక్కాలని మధ్యప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జగదీష్ వ్యాఖ్యలు చేయడానికి సిపిఐ గా ఖండిస్తున్నామని వెంటనే అతన్ని మంత్రివర్గం నుంచి తొలగించి సైనికులను అవమానపరిచినందుకు అరెస్టు చేయాలని నేడు మగ్దుమ్ నగర్ సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలోఅన్నారు. బిజెపి నాయకులు నిత్యం ఏదో ఒక చోట సైనికుల త్యాగాలను అవమాన పరుస్తూ అదంతా కేవలం మోడీ చేసినట్టు ప్రచారం చేయడం సిగ్గుచేటు కరమని అలాంటప్పుడు బిజెపి నాయకులు పోయి దేశ సేవలో సైనికులుగా పనిచేయాలని అన్నారు.
ట్రంప్ కు లొంగిపోయిన మోడీ :
భారత్ పాక్ మధ్యల యుద్ధం తన వల్లే ఆగిందని ట్రంప్ చేసిన ప్రకటన ను మోడీ ఖండించకపోవడం, భారత్కు సుంకాలు లేని అమెరికా ఉత్పత్తులు పంపిస్తామని చెప్పడం దాన్ని కూడా మోడీ ఖండించకపోవడం, భారతదేశంలో ఆపిల్ సంస్థ పెట్టుబడులు పెట్టొద్దని ట్రంప్ హెచ్చరించడం ఆపిల్ నిర్వాహకులు వెనక్కి తగ్గడం ఇలా ట్రంప్ భారతదేశం ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లి అనేక ప్రకటనలు చేసినప్పటికీ మోడీ మాట్లాడకపోవడం చూస్తుంటే మోడీ మొత్తానికి ట్రంప్ కు లొంగిపోయినట్టు కనిపిస్తుందని దీనివల్ల భారత దేశ ఉత్పత్తులకు పరిశ్రమలకు నష్టం చేకూర్చి అంతిమంగా ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగుల సంఖ్య పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వెంటనే మోడీ తన ఆర్థిక విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక వర్గం ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారికి ముఖ్యంగా హిందువుల పార్టీగా చెప్పుకునే బిజెపి హిందువులకు కూడా నష్టం చేకూరుస్తుందని కాబట్టి ప్రజలు బిజెపి చేసే రాజకీయాలను అర్థం చేసుకోవాలని అన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా స్పందించాలి:
కంచ గచ్చిబౌలి విషయంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అడవులు ప్రభుత్వ భూమి కబ్జా కు అయితుందని కాంగ్రెస్ని విమర్శిస్తున్న సందర్భంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కేవలం ప్రెస్ మీట్ పెట్టకుండా గత ప్రభుత్వ హాయంలో జరిగిన భూకబ్జాలపైన కాంగ్రెస్ నాయకత్వం పోరాడాలని కేవలం ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని, వెంటనే స్థానిక నాయకత్వం అందరూ కలిసి గత బి ఆర్ ఎస్ హాయంలో జరిగిన అవినీతి నష్టం పైన సమగ్ర దర్యాప్తు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్, సిపిఐ నాయకులు జంబు, ప్రభాకర్, జహంగీర్, రామ్ రెడ్డి పాల్గొన్నారు.